ప్రస్తుతం టీమిండియా జట్టు ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అదరగొడుతుంది టీమిండియా. అందరూ ఆటగాళ్లు కూడా ఫుల్ ఫామ్ లో కనిపిస్తూ ఇక జట్టును విజయ తీరాల వైపుకు నడిపిస్తూ ఉన్నారు. ఒకవైపు జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లు అదరగొడుతుంటే ఇంకోవైపు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపిస్తున్న రోహిత్ శర్మ సైతం తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్ కోట్ వేదికగా జరిగిన నష్టం 434 పరుగుల తేడాతో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది భారత జట్టు. కాగా ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసే చెలరేగిపోగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇంకోవైపు రవీంద్ర చెడేజ ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు బౌలింగ్ లో కూడా అదరగొట్టి జట్టు విజయాలలో కీలకపాత్ర వహించారు అని చెప్పాలి. ఇక బుమ్రా ఎప్పటిలాగానే తన బౌలింగ్ తో మెరుపులు మెరూపించాడు. అయితే టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్లో ఘనవిజయాన్ని సాధించిన నేపథ్యంలో ఇక ఎన్నో పాత సెంటిమెంట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు అంటే చాలు ఇక ఆ మ్యాచ్లో టీమ్ ఇండియా తప్పక గెలుస్తుంది అనే ఒక సెంటిమెంట్ తెర మీదికి వచ్చింది.

 ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ శర్మ సెంచరీ చేసిన ఏ ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా జట్టు ఓడిపోకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో 11 సెంచరీలు చేశాడు. సౌత్ ఆఫ్రికా పై మూడు, ఇంగ్లాండు పై మూడు, వెస్టిండీస్ పై మూడు సెంచరీలు చేయగా ఆస్ట్రేలియా పై 1 శ్రీలంక పై ఒకటి సెంచరీలతో మొత్తంగా 11 సెంచరీలు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా రోహిత్ శర్మ సెంచరీ చేసిన ఏ ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా ఇప్పటివరకు ఓటమి చవిచూడకపోవడం గమనార్హం. ఇలా ఒక రకంగా కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తున్న సెంచరీ టీమ్ ఇండియాకు సెంటిమెంటల్ గా కూడా ఎంతగానో కలిసి వస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: