బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు ఇండియాలో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతిచోట ఇక ఐపీఎల్ పేరే మారుమోగిపోతుంటుంది. క్రీడాభిమానులు అందరూ కూడా అన్ని పనులను పక్కన పెట్టేసి ఇక ప్రతిరోజు జరిగే మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చూడటానికి ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇక ఉద్యోగం చేయడానికి వెళ్లిన చోట కూడా ఇక మొబైల్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతలా ఐపీఎల్ మొదలైన తర్వాత క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ కి ఎడిక్ట్ అయిపోతుంటారు.


 ఇకపోతే ఇప్పటికే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి ఇండియాలో మొదలైంది. ఈ క్రమంలోనే ఐపిఎల్ గురించి ఎప్పటికప్పుడు ఎన్నో వార్తలు కూడా తెరమీదికి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మార్చ్ నెలలో ఐపీఎల్ ఉన్న నేపథ్యంలో.. అదే సమయంలో అటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఐపిఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ విషయంపై ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా రాలేదు.


 అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాన్ని క్రీడా వర్గాలు వెల్లడించడం గమనార్హం  అయితే మొదట ఐపీఎల్ కు సంబంధించి మొదటి విడత షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత రెండో విడత ఐపిఎల్ నిర్వహణకు సంబంధించి ఇక షెడ్యూల్ ని విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl