ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఎంతో మంది ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తెరమీదికి వస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అయితే దేశవాళి ప్రదర్శన ఆధారంగా చాలామంది ప్లేయర్లు టీమిండియాలోకి కూడా వస్తూ ఉంటారు. టీమిండియాలోకి వచ్చిన ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ లోను తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఆటగాడు రెండు మూడు మ్యాచ్లలో విఫలం అయ్యాడు అంటే చాలు నిర్మొహమాటంగా సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే కొంతమంది ప్లేయర్లలో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు దక్కక నిరాశలో మునిగిపోతూ ఉంటారు. ఎందుకో ఇక ఆయా ప్లేయర్లు తమ ఫామ్ నిరూపించుకున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం జట్టు ఎంపిక విషయంలో ఆ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకుండా ప్రతిసారి పక్కన పెడుతూనే ఉంటారు. అయితే ఇలా భారత జట్టులో చోటు దక్కుతుందేమో అని ఏళ్ల తరబడి వేచి చూసిన ఆటగాళ్లు చివరికి నిరాశతో తమ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ఆటగాళ్ల లిస్టులో చేరిపోయాడు మనోజ్ తివారి. ఇతను ఒక టాలెంటెడ్ క్రికెటర్. టీమ్ ఇండియాలో పెద్దగా అవకాశాలు లేకపోయినా. ఐపీఎల్, దేశవాళి క్రికెట్లో మాత్రం బాగా రాణించాడు.


 అయితే ఇక తనకు భారత జట్టులో చోటు రాదు అని ఫిక్స్ అయ్యాడో ఏమో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మనోజ్ తివారి. తనకు తగినన్ని అవకాశాలు వచ్చి ఉంటే తాను కూడా కోహ్లీ, రోహిత్ లాగా రాణించి  ఉండేవాడిని అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. ఇటీవల అన్ని స్థాయిల క్రికెట్కు గుడ్ బై చెప్పేసాడు. ఈ క్రమంలోనే ఒక సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011లో నేను చెన్నైలో వెస్టిండీస్ పై సెంచరీ చేశాను. కానీ తర్వాత మ్యాచ్ లోనే కెప్టెన్ ధోని నన్ను తుది జట్టు నుంచి తప్పించాడు. జట్టులో కొనసాగించి ఉంటే నేను రానించే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ తివారి.

మరింత సమాచారం తెలుసుకోండి: