భారత క్రికెట్లో టాలెంటెడ్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు మయాంక్ అగర్వాల్  ఒకప్పుడు భారత జట్టులో వరుసగా ఛాన్సులు అందుకుని తన టాలెంట్ నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతనిలో టాలెంట్ ఉన్నప్పటికీ ఇక నిలకడలేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు అని అనుకున్నప్పటికీ అది జరగలేదు. చివరికి ఇక  టీమిండియాలో అడపాదడప అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న ఈ ప్లేయర్.. ప్రస్తుతం అటు దేశవాళీ క్రికెట్లో మాత్రం అదరగొడుతున్నాడు. ఐపీఎల్లోనూ తన సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ఇటీవల ఏకంగా మయాంక్ అగర్వాల్ అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయే ఒక షాకింగ్ ఘటన జరిగింది అన్న విషయం తెలిసిందే. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మయాంక్ అగర్వాల్ దాహం వేసి ఇక విమానం సీటు ముందు భాగంలో ఉన్న విషపూరితమైన లిక్విడ్ ను నీరు అనుకొని తాగడంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఏకంగా గొంతులో ఇన్ఫెక్షన్ రావడం కారణంగా కొన్నాళ్లపాటు చివరికి ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే అతను కోలుకొని డిశ్చార్జ్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


 అయితే విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో  ఇక ఇప్పుడు అతను ఎంతో ముందు జాగ్రత్త తో ఉన్నాడు అనేది తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా విమాన ప్రయాణం సమయంలో సొంతంగా అతను ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చినట్లు చూపే విధంగా ఫోటోని ఆయన పోస్ట్ చేశాడు. ఈసారి కచ్చితంగా ఎలాంటి రిస్క్ తీసుకోను అంటూ ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు మయాంక్ అగర్వాల్. వామ్మో ఎంత ముందు జాగ్రత్తో అని కొంతమంది నవ్వుకుంటుంటే.. మార్పు మంచిదే అంటూ ఇంకొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: