జయదేవ్ ఉనద్గత్.. భారత క్రికెట్లో అప్పుడప్పుడు ఇతని పేరు ఒక్కసారిగా తెరమీదికి  వస్తూ ఉంటుంది. ఇక ఇతన్ని ఇండియన్ క్రికెట్లో అన్ లక్కీ ప్లేయర్గా పిలుచుకుంటూ ఉంటారు చాలామంది క్రికెట్ నిపుణులు. ఎందుకంటే ఇతని దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఒకవేళ అవకాశాలు వచ్చిన ఎప్పుడో ఒకసారి టెస్ట్ క్రికెట్లో అవకాశాలు వచ్చాయి తప్ప.. అందరిలా పెద్దగా ఛాన్స్ లు మాత్రం దక్కించుకోలేకపోయాడు.


 అయితే కొన్ని కొన్ని సార్లు తనకు వచ్చిన అవకాశాలు మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంటే.. ఇంకొన్నిసార్లు మాత్రం మీకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు అని చెప్పాలి. అయితే ఇక అటు టీమిండియా తరపున పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయినప్పటికీ రంజి లలో మాత్రం జయదేవ్ ఉనద్గత్ తన ప్రదర్శనలతో ఎప్పుడు ఆకట్టుకుంటూనే వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక సౌరాష్ట్ర జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు ఈ ప్లేయర్. ఇకపోతే క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అవార్డు ఫంక్షన్లో ఇక జయదేవ్ ఉనద్గత్ కి కూడా పలు అవార్డులు దక్కాయి.


 ఈ క్రమంలోనే ఈ అవార్డుల ఫంక్షన్ కి అటు తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యాడు ఈ క్రికెటర్. తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే జయదేవ్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. సౌరాష్ట్ర  క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ లో అమ్మానాన్న చాలా గర్వంగా ఉన్నారు. అయితే ఐఐఎం నుంచి డిగ్రీ పొందాలని అమ్మ కోరిక. కానీ దానిని ఇప్పటికీ కూడా తీర్చలేకపోయాను. నేను ఎంతో ఇష్టంగా చేస్తున్న పనిలో ఓ స్థాయికి చేరుకున్నాను. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను మమ్మీ అంటూ ఒక సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు జయదేవ్ ఉనద్గత్.

మరింత సమాచారం తెలుసుకోండి: