ఇండియాలో క్రికెట్ పండుగ మొదలవ్వడానికి అంత సిద్ధమవుతోంది. మార్చ్ 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపిఎల్ ముగిసిన వెంటనే అటు టి20 వరల్డ్ కప్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇలా ఏడాది మొత్తం ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే టి20 వరల్డ్ కప్ కి ముందు ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ జరిగి ప్రేక్షకులను అలరించింది.


 అచ్చంగా ఇలాగే ఐపీఎల్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుండగా.. అంతకుముందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్ లవర్స్ అందరిని కూడా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. గత ఏడాది బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇక మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం కాబోతుంది.


 ఇలా మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి దశ మ్యాచ్ లు బెంగళూరులో.. ఇక తర్వాత మ్యాచ్ లన్ని కూడా ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి అని చెప్పాలి. తొలి మ్యాచ్లో ఇక డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ జట్టుతో ఢిల్లీ జట్టు తలపడబోతుంది అని చెప్పాలి. అయితే ఉమేన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలలో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: