భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ వైపు అడుగులు వేస్తూ అదరగొడుతున్నారు. అయితే ఇలా టాలెంట్ గా ఉన్న ప్లేయర్లకి అవకాశాలకు కూడా కొదవ లేకుండా పోయింది. ఇక ఒకవైపు దేశవాళి క్రికెట్ తో పాటు ఇంకోవైపు ఐపీఎల్ మరోవైపు ఇక టీమిండియా తరఫున కూడా వరుసగా ఛాన్సులు అందుకుంటున్నారు. ఇలా వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకుంటూ ఇక మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు.

 అయితే ఇలా అందరికీ వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలో అటు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ ఎవరు అంటే మాత్రం ఇక సర్పరాజ్ ఖాన్ పేరు చెప్పాలి. ఎందుకంటే అతను దేశవాళీ క్రికెట్లో మిగతా యంగ్ ప్లేయర్లతో పోల్చి చూస్తే ఎక్కువగానే పరుగులు చేసాడు. సెంచరీల మోత మోగించాడు. కానీ అతనికి ఇక అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే వచ్చాయి. ఐపీఎల్ లోనే కాదు జాతీయ జట్టు తరఫున కూడా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఎంపిక అయ్యాడు. అయితే గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా అతను అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు.


 అయితే ఇక సర్పరాజ్ ఖాన్ ఇక ఇప్పుడు ఒక లక్కీ ఛాన్స్ దక్కబోతుంది అనేది తెలుస్తుంది. గత ఏడాది జరిగిన మినీ వేలంలో అమ్ముడుపోని ఆటగాడుగా మిగిలిపోయిన సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అతను ఆడబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోల్కతా జట్టుకి మెంటర్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్ ఖాన్ సేవలను వినియోగించుకోవాలని ఫ్రాంచైజీకి సూచించినట్లు టాక్. ఎవరైనా ప్లేయర్ గాయపడితే ఇక సర్ఫరాజ్ ను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బాగా రాణించాడు అంటే ప్రతి మ్యాచ్ లోను అతను కొనసాగే అవకాశం లేకపోలేదు. ఇకపోతే గతంలో పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున సర్పరాజ్ ఐపీఎల్ లో ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl