ఒకవైపు ఎంతో మంది స్టార్ ప్లేయర్లు అటు భారత జాతీయ జట్టు తరఫున ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక ప్రస్తుతం అటు భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా వరుస మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లు దేశవాలి క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో భాగంగా ఆడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.


 అయితే ఈ రంజీ ట్రోఫీలో అటు హైదరాబాద్ జట్టు ఊహకందని రీతిలో  అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇక ప్రత్యర్థులను భయపెడుతూ వరుస విజయాలు సాధిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే హైదరాబాద్ ఆటగాళ్ళు ఏకంగా మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేస్తూ ప్రత్యర్థి బౌలర్ల పై పూర్తి ఆధిపత్యం చలా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో హైదరాబాద్ జట్టు నుంచి ఎంతో మంది ప్లేయర్లు టీమ్ ఇండియా తరఫున ఛాన్స్ దక్కించుకునేలాగే కనిపించారు. ఇలా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో విజేతగా నిలిచింది.


 ఈ క్రమంలోనే ఇలా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఆటగాళ్లు అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఏకంగా రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూపులో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు పది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే ఫైనల్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లకు 50వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ జట్టు రంజి ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు కోటి రూపాయలు.. ఇక జట్టులోని ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు అందిస్తాము అంటూ ఇక బంపర్ ఆఫర్ ప్రకటించారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hca