ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఫ్రాంచైజీ క్రికెట్ కు ఎంతలా క్రేజ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తే చాలు ఇక జీవితానికి అంతకంటే ఇంకేం వద్దు అనుకునేవారు ఆటగాళ్ళు. కానీ ఇటీవల కాలంలో మాత్రం దేశం తరఫున ఆడటం కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడి కోట్ల రూపాయలు సంపాదించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇలా టి20 లీగ్ లు నిర్వహిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 కేవలం ఆయా దేశాల స్వదేశీ క్రికెటర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు కూడా ఇందులో భాగం అవుతున్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది క్రికెటర్లు ఫ్రాంచైజీ  క్రికెట్ కి బాగా అలవాటు పడి ఏకంగా క్రికెట్ రూల్స్ ని కూడా మరిచిపోయి విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఫ్రాంచైజీ క్రికెట్ మాయలో పడిపోయి రూల్స్ ని అతిక్రమించిన క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా ఇటీవల చూస్తూ ఉన్నాం. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతూ వున్నాడు నూర్ అహ్మద్. ఇక ఆ జట్టు తరఫున మూడు ఫార్మాట్లకు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున అతను ఆడుతున్నాడు.  ఇక మరోవైపు ఇంటర్నేషనల్ లీగ్ టి20 లో కూడా ఆడుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే నూరు అహ్మద్ పై ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు ఏకంగా నిషేధాన్ని విధించారు. షార్జా వారియర్స్ టీం లో ఉన్న నూర్ అహ్మద్ కాంట్రాక్టు ను అతడి ఫ్రాంచైజీ ఏడాది పాటు పొడగించింది. అయితే రిటెన్షన్ ఒప్పందంపై సంతకం  చేయకుండా అతను సౌత్ ఆఫ్రికా t20 లీగ్ ఆడాడు. ఈ క్రమంలోనే ఇక లీగ్ క్రమశిక్షణ కమిటీ అతనిపై చర్యలు తీసుకుంది. ఇక తొలత 20 నెలల పాటు నిషేధం విధించినప్పటికీ కాంట్రాక్టు ఒప్పందం జరిగినప్పుడు అతను మైనర్ కావడంతో ఇక ఈ నిషేధాన్ని 12 నెలలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: