సాధారణంగా దేశవాళి క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు అటు ఫ్రాంచైజీ క్రికెట్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఒకప్పుడు అన్ని ఫ్రాంచైజీలు కూడా వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారికి ఎక్కువ ధర పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తూ ఉన్నాయి అన్ని ఫ్రాంచైజీలు. ఇక ఇటీవల కాలంలో ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి కూడా ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు సైతం ఆ తర్వాత కాలంలో మంచి ప్రదర్శన చేస్తే చివరికి వారిని జట్టులో చేర్చుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోతున్న సర్పరాజ్ ఖాన్ విషయంలో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇలాగే పోటీ పడుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన 2024 ఐపీఎల్ వేలంలో అతన్ని ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అతను అమ్ముడుపోని  ఆటగాడిగానే మిగిలిపోయాడు అని చెప్పాలి  కానీ ఇప్పుడు టీమిండియా తరఫున అదరగొడుతూ ఉండడంతో అతనిపై కొన్ని ప్రాంచీజీలు కన్నేసాయట.


 ఏకంగా టీమిండియాలో అరంగేట్రంలోనే టెస్టుల్లోను దూకుడైన ఆటతీరుతో అలరించిన సర్పరాజ్ ను ఐపిఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయట. 2023 ఐపీఎల్ మినీ వేలంలో అన్ సోల్డ్ అయిన అతన్ని తీసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ టీంలో చేర్చుకునేందుకు సన్నహాలు చేస్తూ ఉన్నాయ్ అన్నది తెలుస్తుంది. అయితే బ్యాటింగ్ తో పాటు కీపింగ్ చేయగల సామర్థ్యం సర్ఫరాజ్ సొంతం. దీంతో అతన్ని జట్టులో చేర్చుకోవాలని అనుకుంటున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: