భారత్ జట్టుకు టెస్టు ఫార్మాట్లో సొంత గడ్డపై తిరుగులేదు. ఇది ఎవరో చెప్పడం కాదు ఏకంగా భారత జట్టు రికార్డులు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. దాదాపు గత 12 ఏళ్ల నుంచి ఒక్క సిరీస్ ని కూడా సొంత గడ్డపై ఓడిపోలేదు టీమ్ ఇండియా. ఇప్పుడు వరకు 16 టెస్టు సిరీస్లను వరుసగా గెలుస్తూ వచ్చింది. అయితే ఇక ఎప్పుడు ఈ 16 సంఖ్యను ఏకంగా 17కి మార్చుకుంది టీం ఇండియా. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఘనవిజయాన్ని అనుకొని సీరిస్ ను కైవసం చేసుకుంది.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి అని చెప్పాలి  అయితే ఇక ఇటీవలే ముగిసిన రాంచి టెస్టులో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక వరుసగా హాఫ్ సెంచరీలు చేసి తన ప్రదర్శనతో పర్వాలేదు అనిపించాడు. ఈ క్రమంలోనే సర్పరాజ్ ప్రదర్శన పై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల ఇంగ్లాండు ఇన్నింగ్స్ సమయంలో మాత్రం సర్ఫరాజ్ చేసిన పని అటు కెప్టెన్ రోహిత్ శర్మకు అస్సలు నచ్చలేదు. దీంతో ఏకంగా అతనికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పాలి.


 రాంచీ టెస్ట్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో షార్ట్ ఫీల్డింగ్   పొజిషన్లో సర్పరాజ్ ఖాన్ ఉన్నాడు. సాధారణంగా అక్కడ ఫీల్డింగ్  చేసే ఆటగాడు ఎవరైనా సరే ఇక హెల్మెట్ ధరించడం చేస్తూ ఉంటారు  కానీ సర్పరాజ్ మాత్రం హెల్మెట్ వద్దని చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ స్పందిస్తూ ఇక్కడ హీరో కావడానికి ప్రయత్నించొద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సర్ఫరాజ్ వెంటనే హెల్మెట్ తెప్పించుకున్నాడు. అయితే ఇదంతా స్టంప్స్ మైక్ లో రికార్డు అయింది అని చెప్పాలి. జట్టు ఆటగాళ్ళను కాపాడుకోవడంలో రోహిత్ శర్మ ఎప్పుడు ముందుంటాడు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: