ఇటీవల కాలంలో టీమిండియాలో ఎంతోమంది యువ ఆటగాళ్లు వరుసగా చాన్సులు దక్కించుకుంటున్నారు. అయితే ఇలా ఛాన్సులు దక్కించుకున్న వారు వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ సత్తా ఏంటో నిరూపించుకొని ఇక టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తమ ప్రదర్శనతో అదరగొట్టి ఒక్కసారిగా హీరోగా మారిపోతున్నారు. అయితే ఇటీవల రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే టీమ్ ఇండియన్ క్రికెట్ లో ఒక నయా హీరో తెర మీదకి వచ్చాడు.


 అతను ఎవరో కాదు యువ ఆటగాడు దృవ్ జురెల్. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనే అతను భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మొదటి నుంచి కూడా తన ప్రదర్శనతో పర్వాలేదు అనిపిస్తూ వస్తున్నాడు దృవ్ జురెల్. అయితే ఇటీవల రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో మాత్రం తన బ్యాటింగ్ తో  అదరగొట్టాడు అని చెప్పాలి. కీలకమైన ఆటగాళ్లు అందరూ కూడా వికెట్లు కోల్పోయి ఫెవిలియన్ చేరిన సమయంలో ఏకంగా తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులతో రాణించాడు ఈ యువ ఆటగాడు. దీంతో అతని ఆట తీరుపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 కాగా దృవ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిపై ప్రశంసలు కురిపించాడు. మీడియా హైప్, డ్రామా లేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించాడు. వెల్ డన్ దృవ్ జురెల్.. నీకు శుభాకాంక్షలు అంటూ ప్రశంసించాడు. అయితే దృవ్ జురెల్ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియాకు మరో మహేంద్ర సింగ్ ధోనీ దొరికినట్లే అని అటు మరో దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను చూపించిన మానసిక పరిణితి అద్భుతం అంటూ కొనియాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: