ప్రస్తుతం ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూలు కూడా విడుదల చేసింది. మార్చ్ 22వ తేదీన ఈ మెగా టోర్ని జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఐపిఎల్ టోర్నీ కోసం అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇండియాలో ఐపిఎల్ హడావిడి మొదలైన నేపథ్యంలో ఇక ఈ టోర్నీలో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవరైనా అద్భుతమైన ప్రదర్శన చేశారు అంటే వారి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఆడబోయే ఆటగాళ్లు కొంతమంది ఇప్పటికే ఇక పలు టోర్నీలలో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్న ఒక యువ ఆటగాడు ఇక ఇప్పుడు ఏకంగా త్రిబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  చెన్నై జట్టు అభిమానులు అందరూ కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది ఫాన్స్ అయితే అతని బ్యాటింగ్ చూసి ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం అండర్ 23 కల్నల్ సి కె నాయుడు ట్రోఫీ జరుగుతుంది.


 ఇక ఇటీవలే తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో యూపీ తరఫున బరిలోకి దిగిన సమీర్ రిజ్వి.. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో సమీర్ రిజ్వి 266 బంతుల్లో 33 ఫోర్లు, 12 సిక్సర్లు సహాయంతో 312 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ గురించి అందరికి చర్చించుకుంటున్నారు. కాగా ఈ యువ ఆటగాడిని ఐపీఎల్ 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్ల రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ కు దక్కిన అత్యధిక ధర ఇదే కావడం గమనార్హం. అతనిలో అంత ప్రతిభ ఉంది కాబట్టే ధోని అతనిపై అంత భారీ ధర పెట్టాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: