టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. తన ఆట తీరుతో ఎప్పుడు ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేస్తూ ఉంటాడు ఈ ఆటగాడు. ఏకంగా ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించడమే కాదు బ్యాటింగ్ లోను విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో కూడా అతను కీలక ప్లేయర్గా వ్యవహరించాడు. కానీ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం గాయం బారిన పడి చివరికి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ప్రస్తుతం అతను లేకుండానే టీమ్ ఇండియా వరుసగా సిరీస్ లు ఆడుతూ ఉండడం గమనార్హం. అయితే గాయం నుంచి ఇటీవలే కోలుకున్న హార్దిక్ పాండ్యా మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఫోటోలు వీడియోలు.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే దాదాపు 5 నెలల విరామం తర్వాత ఇప్పుడు హార్దిక్ పాండ్యా మళ్లీ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అన్నది తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశవాళి టోర్నీలో ఆడుతూ అదరగొడుతూ ఉన్నాడు. డివై పాటిల్ టి20 టోర్రీలో ఇటీవల రీ ఎంట్రీ మ్యాచ్ లోనే అదరగొట్టేసాడు హార్దిక్ పాండ్యా.


 ఏకంగా కెప్టెన్గా తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక డివై పాటిల్ టి20 కప్ లో రిలైన్స్ టీం కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతను.. బీపీసీఎల్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా రెండు వికెట్లు తీసాడు. అయితే ఈ మ్యాచ్ లో మొత్తంగా మూడు ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా తొలి రెండు ఓవర్లలో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మూడో ఓవర్లో మాత్రం కట్టుదిట్టంగా బంతులు వేశాడు. కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో పదవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన హార్థిక్ పాండ్యా మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక అతని ఆట తీరు చూస్తుంటే త్వరలోనే టీమ్ ఇండియా జట్టులోకి వచ్చేలాగే కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: