భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మెకళ్లమ్ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ టీం బజ్ బాల్ అనే కొత్త ఆట తీరును ప్రారంభించింది. టెస్ట్ ఫార్మాట్లో ఎప్పుడూ కనిపించే నెమ్మదైన ఆటతీరుతో కాకుండా ప్రత్యర్థులపై ఎటాక్కింగ్ గేమ్ ఆడుతూ వస్తుంది ఇంగ్లాండు జట్టు. ఇక ఇదే ఆట తీరుతో ఏకంగా భారత జట్టును సొంత గడ్డపైనే ఓడించాలి అనే పట్టుదలతో ఇండియా పర్యటనకు వచ్చింది.


 ఇక ఇదే పట్టుదలతో అటు మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించి అదరగొట్టింది. దీంతో ఇంగ్లాండ్ బజ్ బాల్ ముందు అటు భారత జట్టు నిలవలేదు అని కొన్ని విమర్శలు కూడా వచ్చాయ్. దానికి తోడు ఇంగ్లాండ్ బజ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు టెస్ట్ సిరీస్లలో నాలుగంటిలో విజయం సాధిస్తే మూడు సిరీస్లు డ్రాగ ముగిసాయి అని చెప్పాలి. దీంతో ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఇండియా పై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గెలుస్తుందని కొంతమంది అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ ను వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడించింది టీమిండియా. దీంతో 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.


 బజ్ బాల్ ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు మొదటి సిరీస్ ను కోల్పోయింది. అయితే ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇలా ఓడిపోయి, సిరీస్ కోల్పోవడం పై ఆ జట్టు కోచ్ మెకళ్ళమ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కీలక సమయంలో రాణించలేకపోయాం అంటూ తెలిపాడు. మాకంటే భారత్ మెరుగ్గా ఆడింది. మేము యాషెష్ తో పాటు ఈ సిరీస్ కూడా కోల్పోయాం. కానీ గతంలో కంటే ఇప్పుడు మట్టి మరింత మెరుగ్గా ఉంది. రాబోయే 18 నెలల్లో స్పెషల్ గా ఇంకేదైనా చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక మా జట్టులో ఉన్న యువ స్పిన్నర్లు బాగా రాణించారు అంటూ కోచ్ మేకళ్ళమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: