టీమిండియా తరఫున సెలెక్ట్ అయిన ఆటగాళ్లు గత కొంతకాలం నుంచి దేశవాళి క్రికెట్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. ఆడితే టీమిండియా తరఫున ఆడటం.. లేదంటే క్రికెట్కు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్లో బరిలోకి దిగడం లాంటివి చేస్తున్నారు  ఐపీఎల్లో తమ ఫామ్ నిరూపించుకుని మళ్ళీ టీమిండియాలోకి రావాలని ఆశ పడుతున్నారు అని చెప్పాలి. దీంతో ఒకప్పటిలా అటు దేశవాళీ క్రికెట్లో ఎవరూ కూడా అటు అనుభవజ్ఞులైన ప్లేయర్లు కనిపించడం లేదు. ఒకప్పుడైతే ఇక ఫామ్ కోల్పోయిన ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ టోర్నీలలో ఆడుతూ మళ్ళీ తమ ఫామ్ నిరూపించుకొని టీమిండియాలోకి వచ్చేవారు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది ప్లేయర్లు అటు దేశవాళి టోర్నీలను నిర్లక్ష్యం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇదే విషయంపై గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు ఎవరైతే మళ్లీ ఫామ్ అందిపుచ్చుకునేందుకు దేశవాళి క్రికెట్ ఆడటం లేదో.. వారిని ఏకంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇక దేశవాళీ క్రికెట్ ఆడితేనే టీమ్ ఇండియాలోకి తీసుకుంటాము అంటూ స్పష్టం చేసింది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీసీసీఐ.


 అయితే బీసీసీఐ ఇలా దేశవాళీ క్రికెట్ ను పక్కన పెడుతున్న ఆటగాళ్లపై తీవ్ర అగ్రహంతో ఉన్న నేపథ్యంలో.. కొంతమంది ఆటగాళ్లు దిగివస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారట. వెన్నునొప్పి కారణక టీమిండియా కు, ముంబై రంజి టీంకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కోరుకున్నాడట. మార్చి రెండవ తేదీ నుంచి తమిళనాడుతో జరిగే రంజీ ట్రోఫీ సెమి ఫైనల్లో ఆడబోతున్నాడు. ఇంగ్లాండుతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అతను పరుగులు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అయితే ఇక ఇప్పుడు రాంజీలు ఆడి మళ్లీ ఫామ్ నిరూపించుకోవాలని అనుకుంటున్నాడట. అయితే బీసీసీఐ తో ఉన్న వాషింగ్టన్ సుందర్ ని కూడా అటు సెలెక్టర్లు రిలీజ్ చేశారట. దీంతో అతను సెమి ఫైనల్లో తమిళనాడు జట్టు తరుపున ఆడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: