ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది భారత జట్టు. దాదాపు గత 12 ఏళ్ళ నుంచి కూడా టీమిండియా సొంత గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే ఈ విజయ పరంపరను ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లోను కొనసాగించింది భారత జట్టు. ఏకంగా వరుసగా 17వ టెస్టు సీరిస్ ను గెలుచుకుంది అని చెప్పాలి.


 మొదటి టెస్ట్ మ్యాచ్ లో కాస్త తడబాటుకు గురై ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసి పుంజుకుంది భారత జట్టు.. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా విజయాలు సాధించి ఇక 4-1 తేడాతో సిరీస్ ను కైవసం  చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీమిండియా సాధించాల్సింది సాధించేసింది. ఇక ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఎలాగో లేదు   దీంతో ఇక ఐదో టెస్ట్ విషయంలో భారత సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తోంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించారట.


 ఐదో టెస్ట్ మ్యాచ్లో అటు భారత జట్టు కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిపోతుంది అన్నది తెలుస్తుంది. ఆ కొత్త కెప్టెన్ ఎవరో కాదు ఏకంగా జట్టులో సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్. అంతేకాకుండా ఇప్పటివరకు కేవలం బెంచ్ కి మాత్రమే పరిమితమైన ఆటగాళ్లకు సైతం చివరి టెస్ట్ మ్యాచ్ లో అవకాశాలు ఇవ్వడానికి సెలెక్టర్లు సిద్ధమవుతున్నారట. గత కొంతకాలం నుంచి విరామం లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ కు రెస్ట్ ఇచ్చి 100వ టెస్ట్ ఆడబోతున్న అశ్విన్ కు కెప్టెన్సీ అప్పగించాలని అనుకుంటున్నారట. అయితే రోహిత్ స్థానంలో పడిక్కల్ ను జట్టులోకి ఓపెనర్గా బరీలోకి దింపుతారని తెలుస్తోంది. దీంతో అశ్విన్, జడేజా తప్పితే ఇక కుర్రాళ్లతోనే టీమ్ ఇండియా బరిలోకి దిగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: