భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ప్రకటించిన లిస్టు చూసుకుంటే ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లకి కూడా భారత సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. దీంతో ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. కానీ కొంతమంది స్టార్ ప్లేయర్లకు మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఇలాంటి వారిలో అటు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నారు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి భారత జట్టుకు అతను దూరంగా ఉంటున్నాడు. అయితే గాయం నుంచి కోలుకున్నప్పటికీ దేశవాళీ క్రికెట్ మాత్రం ఆడటం లేదు.


 భారత జట్టుకు దూరంగా ఉన్న సమయంలో దేశవాళి క్రికెట్ ఆడాలి అన్న నిబంధనలను శ్రేయస్ అయ్యర్ బేకాతరు చేశాడు అన్న కారణంతో అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఇక అతన్ని ఇలా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించడంపై మాత్రం తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. కొన్నాళ్లపాటు సరిగా ఆడకపోతే అతని పక్కన పెట్టేస్తారా అంటూ అయ్యర్ అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ లో అయ్యర్ ఏం చేస్తాడో అప్పుడే మరిచిపోయారా అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు అయ్యర్ అభిమానులు.


ఇలా అతడికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కల్పించకపోవడంపై నెట్టింట తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శ్రేయస్ 2023 వన్డే ప్రపంచం కప్ లో అద్భుతంగా ఆడి 530 పరుగులు చేశాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో 70 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు. అలాంటి శ్రేయస్ అయ్యర్ చేసిందాన్ని మర్చిపోయి మూడు నెలల్లోనే కేవలం అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు అయ్యర్ అభిమానులు. మూడేళ్లపాటు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన కోహ్లీ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరించలేదు. టీమిండియాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: