సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు మరింత ఎక్కువగా క్రేజీ ఉంటుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు కేవలం ఒకే ప్రాంతంలో మాత్రమే గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అది కూడా ఒకే భాషలో. ఇక ఈ మధ్య కాలంలో రెండు మూడు భాషల్లో గుర్తింపును పొందుతున్నారు. అయితే క్రికెటర్లు మాత్రం ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లో బాగా క్లిక్ అయ్యారు అంటే చాలు ప్రపంచ దేశాలలో వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఒక జట్టు తరుపున స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారి గురించి ఇక ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు అందరూ కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కొంతమంది ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకుంటే ఇంకొంతమంది మాత్రం పర్సనల్ విషయాలకు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక స్టార్ క్రికెటర్ల యొక్క ఆస్తులు ఎంత.. వారు వాడే ఖరీదైన కార్లు లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న బుమ్రా సంపాదన ఎంత అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఇదే విషయంపై  stockgro కీలక విషయాలను సోషల్ మీడియాలో అందరితో పంచుకుంది.


 ప్రస్తుతం భారత్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రా ఆస్తి విలువ 55 కోట్ల రూపాయలట. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగుతూ ఉన్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే అతనికి బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తుంది అని చెప్పాలి. ఇక దీంతో పాటు ప్రతి టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు, వన్డే మ్యాచ్ కి ఏడు లక్షలు, టి20 మ్యాచ్ కి మూడు లక్షల మ్యాచ్ ఫీజు దక్కుతుంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ద్వారా దాదాపు ఏడాదికి 12 కోట్ల రూపాయలను అందుకుంటున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇక మరోవైపు వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో అఫీషియల్ గా బుమ్రా ఆస్తులు విలువ 55 కోట్ల రూపాయలు అయినప్పటికీ అన్ అఫీషియల్ గా మాత్రం వందల కోట్లు ఉండే అవకాశం ఉందని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: