టెస్ట్ ఫార్మాట్ మనుగడ ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఆడేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు రోజుల్లో విశేషమైన ప్రేక్షకాదరణ  పొందుతున్న పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనే ఎక్కువ కాలం పాటు అటు కెరియర్ ను కొనసాగించాలని ఆశపడుతున్నారు అని చెప్పాలి. ఇక కొంతమంది క్రికెటర్లు అయితే ఏకంగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి మరి.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కొనసాగుతూ ఉండడం గమనార్హం. తద్వారా ఏ క్రికెటర్ కూడా టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు.


 ఇక కొంతమంది అయితే టెస్ట్ ఫార్మాట్ ను మాత్రమే కాదు.. ఇక డొమెస్టిక్ క్రికెట్ ను కూడా పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బీసీసీఐ అటు టెస్ట్ ఫార్మాట్ ని కాపాడటంతో.. పాటు ఇక డొమెస్టిక్ క్రికెట్ ను కూడా రక్షించేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే భారత జాతీయ జట్టులోకి రావాలి అంటే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అంటూ ఒక నిబంధన పెట్టింది. అంతేకాకుండా టెస్ట్ ఫార్మాట్ తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడే ప్లేయర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.


 ఒక ఏడాదిలో జరిగిన అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు 15 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించింది బీసీసీఐ. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. అయితే అలాగే ఒకే ఏడాదిలో జరిగిన అన్ని రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాడికి 75 లక్షల రూపాయల నజరానా అందించాలని బిసిసిఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రవిడ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో ఇప్పటికే చర్చలు కూడా జరిపారట. ఇక త్వరలోనే బీసీసీఐ పెద్దలు ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు అని చెప్పాలి. బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: