ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది టీం ఇండియా. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇక తర్వాత జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా ధర్మశాల వేదికగా జరగబోయే ఐదవ టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.


 ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇక భారత జట్టులో చోటు సంపాదించుకున్న యువ ఆటగాడు యశస్వి జైష్వాల్ తన ఆటతీరుతో అదరగొట్టేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలను చేసి ఇక ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతూ ఉన్నాడు ఈ యంగ్ సెన్సేషన్ ప్లేయర్. ఇక అతని బ్యాటింగ్ విధ్వంసం ముందు స్టార్ బౌలర్లు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో వన్డే తరహా ఆట తీరుతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ధర్మశాల వేదికగా జరగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్ లో కూడా అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే తన బ్యాటింగ్ తో సెన్సేషన్ సృష్టించిన యశస్వి జైష్వాళ్ ను  ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఒక అరుదైన రికార్డు  ఊరిస్తుంది. ఇంగ్లాండుతో చివరి టెస్ట్ మ్యాచ్ లో అతను 98 పరుగులు చేస్తే 34 ఏళ్ల రికార్డు బద్దలవుతుంది అని చెప్పాలి. ఇంగ్లాండ్, ఇండియా మధ్య ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యశస్వి జైష్వాల్ నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ గ్రాహం గుచ్ పేరిట ఉంది. 752 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యశస్వి  మార్చి ఏడవ తేదీ నుంచి జరగబోయే ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఇక ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డులు బద్దలు కొట్టడానికి యశస్వికి కేవలం 98 పరుగులు మాత్రమే అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: