టీమిండియాకు దూరంగా ఉన్న సమయంలో దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే అంటూ అటు బీసీసీఐ పెట్టిన రూల్ ని బేకాతరూ చేయడంతో ఇటీవల ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ లకు బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కల్పించిన సెలెక్టర్లు ఇక ఇద్దరు ప్లేయర్లను మాత్రం సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటినుంచి భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ లు ఆడిన సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సెలెక్టర్లు.


 ఈ క్రమంలోనే ఇక సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు దాదాపుగా జట్టులో స్థానం దక్కడం కష్టమే అన్నది తెలుస్తుంది. కానీ ఒకవేళ ఈ ఇద్దరు ప్లేయర్లు మళ్ళీ భారత జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకోవాలి అంటే మాత్రం ఉన్న ఒకే ఒక్క అవకాశంఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే అని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా సెంట్రల్ కాంట్రాక్టులో 30 మందికి అవకాశం కల్పించింది బీసీసీఐ. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లను మాత్రం తొలగించింది. కాగా మార్చ్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్లో ఇద్దరు ప్లేయర్లు బాగా రాణించి ఫామ్ నిరూపించుకున్నారు అంటే సెలెక్టర్లు మళ్ళీ వీళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


 ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వక పోయినప్పటికీ ఈ ఇద్దరిని ఇక జట్టులోకి తీసుకునే ఛాన్సులు మాత్రం ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు అటు ఐపీఎల్ లో కూడా విఫలమయ్యారు అంటే మళ్ళీ భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవడం కోసం.. ఇక చాలా కాలం పాటు ఇద్దరు ప్లేయర్లు కూడా ఎదురు చూడాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: