భారత జాతీయ జట్టులో ఛాన్స్ దక్కక ఖాళీగా ఉన్న ఆటగాళ్లు అందరూ కూడా తప్పనిసరిగా రంజీ మ్యాచ్లలో ఆడాల్సిందే అంటూ బిసిసిఐ నిబంధన పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక బిసిసిఐ పెట్టిన ఈ కొత్త రూల్ ని ఉల్లంఘించిన శ్రేయస్ అయ్యర్,  ఇషాన్ కిషన్లపై ఇక కఠినమైన చర్యలకు సిద్ధమైంది బీసీసీఐ. ఈ ఇద్దరు ప్లేయర్లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు ప్లేయర్లను సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తప్పించడం గురించి భారత క్రికెట్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది.


 అయితే కేవలం యంగ్ ప్లేయర్స్ మాత్రమే కాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు కూడా సమయం దొరికినప్పుడు రాంజీ మ్యాచ్లలో ఆడాలి అంటూ భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. ప్రతి ఒక్కరు కూడా రంజీ క్రికెట్ ఆడాల్సిందే. కానీ ప్రస్తుతం అందరూ ఐపీఎల్ పైనే దృష్టి పెడుతున్నారు. అయితే ఐపీఎల్ టోర్ని వినోదాన్ని ఇస్తుంది అన్నది వాస్తవం. కానీ సుదీర్ఘ ఫార్మాట్ అసలైన క్రికెట్. ఒక ఆటగాడికి దేశానికి ఆడే అవకాశాన్ని అందించేది కూడా ఇదే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా ఖాళీ సమయం దొరికితే తప్పకుండా దేశవాలి మ్యాచ్ లు ఆడాలి. అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై మాత్రమే కొరడా ఝాలిపించడం  ముమ్మాటికి తప్పు. నిబంధనలను మీరితే ఎవరి పైన అయినా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ కీర్తి ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు  ఇక ఇప్పుడు అందరి ప్రాధాన్యత టి20 పైన ఉంది. ఒకప్పుడు స్టార్ ఆటగాళ్ళు అందరూ తమ రాష్ట్ర జట్టు తరపున రంజీలలో ఆడేవాళ్లు అంటూ కీర్తి ఆజాద్ గుర్తు చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం క్రికెటర్లు అందరూ కూడా టి20 లకే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు  అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు ఇంగ్లాండు ఆటగాళ్లు కౌంటిలలో బరిలోకి దిగుతూ ఉంటారు. కానీ భారత ఆటగాళ్ళకు రంజీలు ఆడటానికి ఏమైంది అంటూ ప్రశ్నించారు కీర్తి ఆజాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: