గత రెండు మూడేళ్ల నుంచి కూడా మహేంద్రసింగ్ ధోని గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది అంటే చాలు ఇక ఈ ఐపిఎల్ సీజన్ ధోనీకి చివరిది అంటూ ఒక ప్రచారం తెరమిదికి వస్తోంది. ఇలాంటి ప్రచారం ఎప్పుడు అభిమానులు అందరిని కూడా ఆందోళనలో ముంచేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎన్నిసార్లు ధోని ఐపీఎల్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చినప్పటికీ.. అటు మహేంద్రుడు మాత్రం ఇక వరుసగా ఐపీఎల్ సీజన్స్ లో కొనసాగుతూనే వస్తున్నాడు. ఇక గత ఏడాది అయితే ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను టైటిల్ విజేతగా కూడా నిలపాడు అన్న విషయం తెలిసిందే. అయితే ధోని ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్న విషయం ఎవరికీ ముందుగా సమాచారం ఇవ్వడని.. ఇక ఆ విషయంలో అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా పలుమార్లు తెలిపింది.దీంతో ఇక ధోని ఎప్పుడు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించి ట్విస్ట్ ఇస్తాడో అని ప్రతిక్షణం కూడా అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటీవల ధోని క్లోజ్ ఫ్రెండ్ ఫరంజిత్ సింగ్ మహేంద్రుడి ఐపీఎల్ ఫ్యూచర్ పై ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరంజిత్ సింగ్ ధోని ఐపీఎల్ కెరియర్ గురించి మాట్లాడుతూ.. మహికి ఇది చివరి సీజన్ కాదు అంటూ తెలిపాడు.


 మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికి ఎంతో ఫిట్గా ఉన్నాడు. అతనికి ఇది చివరి సీజన్ అవుతుందని నేను అస్సలు అనుకోవడం లేదు. ధోని ఒకటి లేదా మరో రెండు సీజన్లు ఆడతాడని అనుకుంటున్న. కచ్చితంగా ఒక్క సీజన్ అయితే ఆడతాడు  ఎందుకంటే అతను ఎంతో ఫీట్ గా ఉన్నాడు అంటూ పరంజిత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ధోని స్నేహితుడి మాటలు అటు మహి అభిమానులు అందరిలో కూడా ఆనందాన్ని నింపుతూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఇకపోతే మార్చ్ 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇక ఓపెనింగ్ మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలబడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: