ఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన పాములలో కొండచిలువలు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. నాగుపాముల లాగా కొండచిలువులకు విషం ఉండదు. కానీ ఒక్కసారి కొండచిలువ పట్టు బిగించింది అంటే చాలు ఇక దాని నుంచి తప్పించుకోవడం పెద్ద పెద్ద జంతువులకు అసాధ్యం  అని చెప్పాలి. ఎంత పెద్ద జంతువునైనా సరే అమాంతం మింగేసి ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది కొండచిలువ. అందుకే ఇలాంటి ప్రమాదకరమైన జీవుల జోలికి వెళ్లే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి అని చెప్పాలి. కానీ కొంతమంది మందు బాబులు మాత్రం ప్రమాదకరమైన పాములతోనే ఆటలు ఆడటం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగానే మందుబాబులు ఒక పెగ్గు గొంతులోకి దిగింది అంటే చాలు కొన్ని కొన్ని సార్లు ఎలా ప్రవర్తిస్తారో కూడా చెప్పలేని విధంగా ఉంటుంది. ఏకంగా ఈ లోకాన్ని సైతం మరిచిపోయి చిత్ర విచిత్రంగా  ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్థం కాలేదు. ప్రమాదకరమైన కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకున్నాడు. ఇదేం చేయదు.. ఇలాంటి కొండచిలువలను చాలానే చూశాను అంటూ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. కానీ కొండచిలువ ఊరుకుంటుందా దాని పని అది చేయడం మొదలు పెట్టింది. ఏకంగా ఒక్కసారిగా అతని మెడను చుట్టేసింది. దీంతో ఊపిరాడక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సదరు వ్యక్తి. కేరళలోని కన్నూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చంద్రం అనే వ్యక్తి రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మధ్యమధ్యలో ఏకంగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక కొండచిలువను తీసుకొని మెడలో వేసుకున్నాడు. ఇక అనంతరం అక్కడే ఉన్న ఒక పెట్రోల్ బంకులోకి వెళ్ళాడు. తాను మెడలో కొండ చిలువను వేసుకుంటానని దాని ఫోటో తీయాలని పెట్రోల్ బంకు సిబ్బందిని కోరాడు. ఇక వాళ్ళు కూడా అలాగే ఫోటోలు తీశారు. అంతలోనే కొండచిలువ అతని మెడను చుట్టేసింది. దీంతో ఊపిరాడక పోవడంతో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది వచ్చి కొండచిలువను విడిపించడంతో అతను ఇక ప్రాణాలతో బయటపడగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: