ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా వరుసగా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అయితే ఇప్పటికే నాలుగు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్లలో మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా మిగతా మూడు మ్యాచ్లలో మాత్రం ఘనవిజయాలను అందుకుంది. దీంతో 3-1 తేడాతో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 అయితే ధర్మశాల వేదికగా ఐదవ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది  ఇకపోతే రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ అటు ధర్మశాల వేదికగా జరగబోతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ కి మధ్యలో ఏకంగా 10 రోజుల గ్యాప్ ఉంది అని చెప్పాలి. అయితే ఎందుకు ఇలా రెండు టెస్ట్ మ్యాచ్లు మధ్య ఇంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంపై కూడా ప్రస్తుతం జరుగుతుంది . అయితే ఇక ఇలా రెండు టెస్ట్ మ్యాచ్ ల మధ్య గ్యాప్ ఇవ్వడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది. దీనికి కారణం ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఇక అని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లు ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగానే ఇలా ప్లాన్ చేశారు అంటూ ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


 అయితే ఈ విషయం తెలిసి అటు నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఫంక్షన్ కోసం భారత జట్టు తరుపున ఆడాల్సిన మ్యాచ్ విషయంలో నిబంధనలను విధించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే అటు ముఖేష్ అంబానీ కొడుకు ఫ్రీ వెడ్డింగ్ కోసం ఇలా రెండు టెస్ట్ మ్యాచ్లు మధ్యలో గ్యాప్ ఇచ్చారా లేకపోతే సాదరణంగానే ఇలా జరిగిందా అనే విషయంపై మాత్రం ఎవరికీ నిజం తెలియదు. ఇకపోతే ఇప్పటికే మూడు మ్యాచ్లలో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా..  ధర్మశాల వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: