సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తమ ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటారు. కాబట్టి ఇక ఆయా ప్లేయర్లకు సంబంధించి ఏ విషయం ఇంటర్నెట్ లోకి వచ్చినా తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలకంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి.. అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెటర్లకి సంబంధించిన విషయాలు నిమిషాల వ్యవధిలో ఇంటర్నెట్లో ప్రపంచమంతా పాకి పోతూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు భారత స్పిన్నర్ చాహాల్ కు సంబంధించిన ఒక న్యూస్ ఇలాగే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది   అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. స్పిన్నర్ చాహల్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇక ఏదో ఒక విషయంతో వార్తల్లో హాట్ టాపిక్ గానే మారిపోతూ ఉంటుంది. గతంలో చాహాల్ సహచరుడు శ్రేయస్ అయ్యర్ తో ధనశ్రీ వర్మ కాస్త క్లోజ్ గా ఉండడంతో ఏకంగా వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ధనశ్రీ వర్మ కు సంబంధించి ఇలాంటి న్యూస్ ఒకటి తెరమీదకి వచ్చి సంచలనంగా మారిపోయింది. టీమిండియా స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ హిందీ డాన్స్ షో జలక్ తికలాజ లో ఇటీవలే పాల్గొంది. అయితే ఈ సందర్భంగా ఆమెను ఒక కొరియోగ్రాఫర్ హగ్ చేసుకోగా.. ఇలా హాగ్ చేసుకున్నప్పుడు తీసుకున్న ఫోటోని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక వీరిద్దరూ ప్రేమికులు లాగ ఎంతో డీప్ హగ్ చేసుకుని ఉన్న ఈ ఫోటో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. పెళ్లయిన ధనశ్రీ వర్మకు మరో వ్యక్తితో ఇంత సాన్నిహిత్య సంబంధం ఉండటమేంటి అని కొంతమంది ఈ ఫోటోపై విమర్శలు చేస్తున్నారు  అయితే వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని భూతద్దం పెట్టి చూడటం మంచిది కాదు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: