టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించిన వార్తా గత కొంతకాలం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ టెస్ట్ సిరీస్ జరుగుతుండగా ఇక మానసిక అలసట కారణం చెప్పి అతను ఇండియాకు వచ్చేసాడు. ఇక అప్పటి నుంచి అటు జట్టుకు ఎక్కడ అందుబాటులో లేడు. ఇక అతను రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. ఈ క్రమంలోనే ఇక అతను నేరుగా ఐపీఎల్లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే బీసీసీఐ అతని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత జట్టులోకి రావాలనుకునే ప్రతి ఆటగాడు కూడా తప్పనిసరిగా రంజీ ట్రోఫీలో మ్యాచ్లు ఆడాల్సిందే అంటూ నిబంధన పెట్టింది. అయితే ఈ నిబంధన నేపథ్యంలో ఇషాన్ కిషన్ రాంజీ మ్యాచ్ లు ఆడతాడు అందరూ అనుకున్నప్పటికీ అది జరగలేదు. దీంతో ఇక బిసిసిఐ చివరికి అతనిపై కఠినమైన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో అతను మళ్ళీ భారత జట్టు తరఫున ఆడటం చాలా కష్టంగానే మారే అవకాశం ఉంది. అయితే ఇషాన్ కిషన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి.


 ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ ఆడేందుకు అతను అందుబాటులో ఉంటాడు అనుకున్నప్పటికీ అది జరగలేదు. అయితే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇషాన్ కిషన్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. సిరీస్ ఆరంభానికి ముందు అతన్ని బీసీసీఐ టెస్టు సిరీస్ కి అందుబాటులో ఉంటాడా లేదా అనే సంప్రదించినట్లు సమాచారం. కానీ ఇక టెస్ట్ సిరీస్ లో ఆడేది లేదని మేనేజ్మెంట్కు తేల్చి చెప్పాడట ఇషాన్ కిషన్.  దీంతో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యవహార శైలితో అటు ఇషాన్ కిషన్ చేజేతులారా తన కెరీర్ ని పాడు చేసుకుంటున్నాడు అంటూ ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: