సాధారణంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఆటగాళ్లు ఏం చేస్తారు అంటే.. ఇలా రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తమకు ఇష్టమైన క్రికెట్కు దగ్గరగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  ఇలా ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు కోచ్ లుగా అవతారం ఎత్తుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే కోచ్ గా మారి తమకు ఉన్న అనుభవంతో ఇక ఎంతోమంది యువ ఆటగాళ్ల ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక మరోవైపు కొంతమంది వ్యాఖ్యాతలుగా కూడా మారిపోతూ తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను మరింత ఉత్కంఠ భరితంగా మార్చడం చేస్తూ ఉంటారు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం భారత క్రికెటర్లు ఇక ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత.. అనూహ్యంగా ఏకంగా రాజకీయాల వైపు అడుగులు వేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. కాగా గతంలో టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే అటు బిజెపి పార్టీలో చేరారు. అంతేకాదు గత పార్లమెంటు ఎన్నికలను ఏకంగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయాలు మరోవైపు క్రికెట్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగారు. అయితే ఇక ఇప్పుడు తన రాజకీయ జీవితంపై సంచలన నిర్ణయం తీసుకున్నాడు గౌతం గంభీర్. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్. అయితే ఈ మేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో గౌతమ్ గంభీర్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే క్రికెట్ ఫై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ప్రస్తుతం గౌతమ్ గంభీర్  తూర్పు ఎంపీగా కొనసాగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: