టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే.. అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే తన ఆట తీరుతో ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అశ్విన్. ముఖ్యంగా టెస్ట్ ఫార్మట్ లో అశ్విన్ సాధించిన రికార్డులు అయితే అసమాన్యమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు అశ్విన్. అందుకే టెస్ట్ ఫార్మట్ లో ఎవరైనా కొత్త ఆటగాడు రికార్డులు సాధించాడు అంటే అతన్ని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో పోల్చి చూడడం చేస్తూ ఉంటారు.


 అయితే నేటి తరంలో టెస్ట్ ఫార్మట్ లో అశ్విన్ కు గట్టి పోటీ ఇస్తూ ఇక అతని రికార్డులకు ఎసరు పెడుతున్న మరో బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే అతను ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియోన్ మాత్రమే అని చెప్పాలి. ఇక అశ్విన్ తో పాటుగానే అతను కూడా రికార్డుల వేట కొనసాగిస్తూ అదరగొడుతూ ఉంటాడు. ఇక జట్టు విజయాలలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అశ్విన్ రికార్డులను ఇప్పటివరకు ఎన్నోసార్లు బద్దలు కొట్టిన నాథన్ లియోన్ ఇక ఇటీవలే మరో రికార్డులు కూడా దాటేసాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.


 నువ్వా నేనా అన్నట్లుగానే హోరాహోరీగా ఈ టెస్ట్ సిరీస్ సాగుతుంది. అయితే ఇటీవలే ముగిసిన టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 5 వికెట్ల హాల్ సాధించాడు నాథన్ లియోన్. ఇక ఈ ప్రదర్శనతో అశ్విన్ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో మొత్తం పదిసార్లు ఐదు వికెట్ల హాల్ సంపాదించాడు నాథన్ లియోన్.  ఈ క్రమంలోనే 9సార్లు ఐదు వికెట్లు తీసిన అశ్విన్ పేరిట ఉన్న రికార్డింగ్ ఇప్పుడు లియోన్ బదులు కొట్టాడు. అయితే ఇటీవల ముగిసిన మ్యాచ్ లో ఏ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కాదు ఏకంగా లియోన్ 10 వికెట్లు తీశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: