టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి కొత్తగా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమోగిపోయేలా చేసుకున్నాడు ఈ ఆటగాడు. ఏకంగా వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న ఏకైక ఆటగాడిగా ప్రస్తుతం హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు బద్దలు కొట్టిన రికార్డులు చాలవు అన్నట్లు ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు.


 అందుకే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా విరాట్ కోహ్లీని రికార్డ్ రారాజు అని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం నేటి జనరేషన్లో వరల్డ్ క్రికెట్లో విరాట్ కోహ్లీని మించిన క్రికెటర్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కోహ్లీ తర్వాతే ఎవరైనా అని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. అయితే కోహ్లీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇక ఈ ఆటలో అంతలా సక్సెస్ అయ్యాడు. అయితే విరాట్ కోహ్లీకి క్రికెట్ కాకుండా మరో ఇష్టమైన ఆట ఏంటి అన్నది చాలామందికి తెలియదు. అయితే ఇటీవలే ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఈ విషయంపై ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 'ఐపీఎల్ ఆన్ స్టార్' కార్యక్రమంలో పాల్గొన్నారు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నాడు  క్రికెట్ కాకుండా తాను ఎక్కువగా బాస్కెట్ బాల్ ఆడతాను అంటూ చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత ఫుట్ బాల్, బ్యాట్మెంటన్, వాలీబాల్ కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాను 23 ఏళ్ల వయస్సు ఉన్న నుంచి కఠినమైన డైట్ ఫాలో అవుతున్నాను అంటూ చెప్పకు వచ్చాడు. అంతకు ముందు మాత్రం ఏది నచ్చితే అది తినేవాడిని అంటూ తెలిపాడు. ఇక తనకు ఇష్టమైన ఆహారం రాజ్మా చావల్ అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: