గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన  మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వరల్డ్ కప్ లో ప్రస్థానాన్ని ముగించుకుని స్వదేశానికి వెళ్లిన పాకిస్తాన్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా బాబర్ అజాం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఆ తర్వాత కోచింగ్ సిబ్బంది లో కూడా మార్పులు చేర్పులు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.


 అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అష్రాఫ్ సైతం చివరికి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక ఆ దేశ క్రికెట్లో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయ్ అని చెప్పాలి. అయితే ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తోంది.



 ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  పాకిస్తాన్ సూపర్ లీగ్ ను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్ ముగిసిన తర్వాత జాతీయ జట్టు సభ్యులందరికీ కూడా ఏకంగా సైన్యంలో శిక్షణ ఇప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది అని చెప్పాలి. ఇలాంటి శిక్షణ వారి ఫిట్నెస్ ను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని.. పాక్ క్రికెట్ బోర్డు భావిస్తుందట. ఫారిన్ ప్లేయర్ల తరహాలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు సిక్సర్లు కొట్టలేకపోవడం కూడా దీనికి మరో కారణం అన్నది తెలుస్తుంది. సిక్సర్లు అలవోకగా కొట్టాలి అంటే ఇక సైన్యంలో శిక్షణ ఎంతో అవసరమని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: