ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది సీజన్ వరకు కూడా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కొనసాగిన హార్థిక్ పాండ్యా.. ఇక ఈ ఏడాది మాత్రం ముంబై ఇండియన్స్ సారాధ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను.. మాత్రం జట్టు యాజమాన్యం అర్ధాంతరంగా సారాధ్య బాధ్యతల నుండి తప్పించింది.


 దీంతో ఇక ఎన్నో అంచనాల మధ్య హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బరిలోకి దిగబోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యా గత కెప్టెన్ రోహిత్ ను మరిపించాల్సి ఉంటుంది. ఎక్కడైనా తేడా జరిగింది అంటే ఇక హార్దిక్ పై విపరీతమైన విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆటగాళ్లు అందరితో కలిసి ప్రాక్టీస్ షురూ చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన పాత స్నేహితుడైన ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు కిరణ్ పోలార్డ్ ను కూడా కలిశాడు. అతనితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి రాగానే.. తన మిత్రులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ మాజీ స్టార్ ప్లేయర్ అయిన పోలార్డ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ కొన్ని బంధాలు ఎప్పటికీ మారవు. మరింత బలపడతాయి. నా సోదరుడు కిరణ్ పోలార్డ్ తో కలిసి మళ్ళీ పని చేయడాన్ని సంతోషిస్తున్న అంటూ హార్దిక్ పాండ్యా.. ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇలా కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ని మొదటిసారి ముందుకు నడిపించబోతున్న హార్దిక్ ఇక రోహిత్ ను మరిపిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl