(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో ఫేవరెట్ జట్లల బరిలోకి దిగిన కొన్ని టీం లు పేలవమైన ప్రదర్శనలు కనబరుస్తూ ఉంటే... పెద్దగా అంచనాలు లేకుండా ఈ సీజన్ లోకి అడుగు పెట్టిన జట్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిస్తూ ఈ సారి ట్రోఫీ తీసుకెళ్లే విధంగా పెర్ఫార్మన్స్ ను ఇస్తున్నాయి. ఈ (ఐ పీ ఎల్) లో భాగంగా నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ ... గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు నష్టపోయి 20 ఓవర్ లలో 196 పరుగులు చేసింది. ఇందులో ఈ జట్టు కెప్టెన్ సంజు సాంసంగ్ 68 పరుగులు చేయగా ... ఆర్ పారగ్ 76 పరుగులు చేశాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ లోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు నష్టపోయి 20 ఓవర్ లలో 199 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచినప్పటికీ ఆఖరి వరకు ఎవరు ఈ మ్యాచ్ లో గెలుస్తారు అనేది సస్పెన్స్ గానే ఉంది. ఆఖరి బంతి వరకు వచ్చిన ఈ మ్యాచ్ ను స్పిన్నర్ రషీద్ ఖాన్ గెలిపించాడు. ఇక తాజా మ్యాచ్ గెలుపుపై ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి జిల్ స్పందించాడు ... రషీద్ ఖాన్ వల్లే తమకు రాజస్థాన్ రాయల్స్ పై విజయం దక్కింది. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. రషీద్ లాంటి ప్లేయర్ జట్టులో ఉండాలి అని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడు అని స్పిన్నర్ రషీద్ ఖాన్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గిల్ ప్రశంశల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gil