ఇండియన్ క్రికెట్ టీం కు ఎన్నో సంవత్సరాలుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు. చాలా సంవత్సరాలుగా రోహిత్ శర్మ ముంబై జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎన్నో ట్రోఫీలను గెలుచుకుంది. ఇక ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన రోహిత్ శర్మ ను ఈ సీజన్ లో పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాతో ముంబై జట్టు కెప్టెన్సీ చేయిస్తోంది.

ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఎన్నిక అయ్యాడు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఈ వార్తపై జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తికి తగ్గట్టుగానే ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడూ లేనంత విధంగా ఈ సారి పేలవమైన ప్రదర్శనను కనబరుస్తుంది. దానితో ఇప్పటికైనా హార్దిక్ ను కెప్టెన్ గా తొలగించే రోహిత్ ని పెట్టండి అని ఎంతో మంది ముంబై ఇండియన్స్ జట్టుకు సలహా ఇస్తున్నారు. ఇకపోతే రోహిత్ ముంబై జట్టు తీరుపై కోపంగా ఉన్నట్లు... దానితో వచ్చే సంవత్సరం ముంబై జట్టుకు కాకుండా మెగా ఆక్షన్ లో పాల్గొని వేరే టీం కి ఆడాలి అని అనుకుంటున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి.

ఇక తాజాగా లక్నో జట్టు కోచ్ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయనకి వేలంలో ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రశ్న ఎదురయింది..? దానికి నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు అని ఆయన తిరిగి ప్రశ్నించగా..? రోహిత్ ను జట్టుకోకి తీసుకోగలరా అనే ప్రశ్న లాంగర్ కి ఎదురయింది. దానికి ఆశ్చర్యపోయిన లాంగర్ ... కచ్చితంగా తీసుకుంటాం. కాకపోతే ఆ డీల్ ని మీరే సెట్ చేయాలి అని నవ్వుతూ ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: