ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు (ఐ పీ ఎల్) 2024 లో భాగంగా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ ... ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియన్ క్రికెట్ టీం లో అత్యంత క్రేజ్ కలిగిన ఆటగాళ్లు అయినటువంటి కోహ్లీ బెంగళూరు జట్టులో ఆడుతూ ఉండగా ... రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం లో ఆడుతున్నాడు. దానితో ఈ రోజు రాత్రి జరగబోయే మ్యాచ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ... ముంబై ఇండియన్స్ జట్టు పై 852 పరుగులు చేయగా ... రోహిత్ శర్మ ... బెంగళూరు జట్టుపై 574 పరుగులు చేశాడు. ఇక బెంగుళూరు పై బూమ్రా అత్యధికంగా 24 వికెట్లు తీశాడు. ఈ రోజు మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది.

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఈ స్టేడియం లో పది సార్లు తలపడగా ముంబై ఇండియన్స్ జట్టు 7 సార్లు గెలుపొందగా ... ఆర్ సీ బీ జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కొన్ని విషయాలలో ముంబై ఇండియన్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైవచేయి సాధించగా ... మరికొన్ని విషయాలలో బెంగళూరు జట్టు పై ముంబై పై చేయి సాధించింది.

ఈ విధంగా చూసుకుంటే ఈ రోజు ఎవరు గెలుస్తారు అనే విషయం చివరి వరకు సస్పెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత సీజన్ లో రోహిత్ శర్మ కంటే కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉండడం బెంగళూరు కి కాస్త కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl