2024 ఐపిఎల్ సీజన్ లో ఎలాంటి అంచనా లేకుండా బరీలోకి దిగిన రాజస్థాన్  రాయల్స్ జట్టు.. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే  అంచనాలకు మించి రాణిస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ.. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది   ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే పరాజయం పాలు అయింది  మిగతా నాలుగు మ్యాచ్లలో కూడా ఘన విజయాన్ని సాధించి అటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ సేన ఓటమిపాలు అయింది. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ముందు ఉంచిన టార్గెట్ ను చేదించిన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. కాగా గుజరాత్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడగా కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే సాధించి పాయింట్లు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది అని చెప్పాలీ. అయితే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి ఈ సీజన్లో మొదటి పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇక ఇక ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తోంది.


 ఇలా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కి బిగ్ షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వహకులు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ 12 లక్షల ఫైన్ విధించింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆయనకు ఈ జరిమానా  పడింది. అయితే మరోసారి ఇదే తప్పు జరిగితే చివరికి అతనిపై నిషేధం పడే అవకాశం ఉంది.  అయితే ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కి కూడా ఏకంగా స్లో ఓవర్ రేట్ కారణంగా 24 లక్షల జరిమానా పడింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: