ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక టీమ్ పై మరో టీమ్ ఆదిపత్యం చలాయించటం  కాదు నువ్వ నేను అన్నట్లుగా చివరి బంతి వరకు సాగుతున్న పోరు ప్రేక్షకులకు అసలు సిసలైన క్రికెట్ మజాని పంచుతూ ఉంది. కాగా ఈ ఐపీఎల్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ నిరాశ పరుస్తూ ఉంటే.. ఇంకోని టీమ్స్ మాత్రం టైటిల్ పోరులో దూసుకుపోతూ ఇక ఈసారి విజయం సాధించేలాగే ఉన్నాయి.



 అయితే ఈ ఐపీఎల్ సీజన్లో అందరి అంచనాలను తారుమారు  చేస్తూ వరుస ఓటములతో అభిమానులను నిరాశపరిచిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై హోం గ్రౌండ్ అయిన వాంకడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అటు ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఒకవైపు అటు ముంబై బౌలింగ్ విభాగం చెలరేగిపోవడం ఇంకోవైపు అటు ఆ జట్టు బ్యాటింగ్ విభాగం విధ్వంసం సృష్టించడంతో ఎంతో అలవోకగా బెంగళూరు టీం పై విజయం సాధించింది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అటు ముంబై బౌలర్ బుమ్రా తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనికించాడు.



 ఏకంగా ఐదు వికెట్లు తీసి చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో రెండు సార్లు హ్యాట్రిక్ కూడా మిస్ కావడం గమనార్హం. అయితే ఈ ప్రదర్శనతో అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ లో ఆర్సిబి పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా అవతరించాడు. చివరిగా ఆశీష్ నెహ్ర చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బెంగళూరు టీం పై నాలుగు వికెట్లు తీశాడు. కానీ ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఆ జట్టుపై ఐదు వికెట్ల హాల్ సాధించలేదు. దీంతో ఆశిష్ నెహ్ర సాధించిన నాలుగు వికెట్ల బెంగళూరు టీం పై అత్యుత్తమ గణాంకాలుగా  ఉన్నాయి. కానీ బుమ్రా ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి ఏకంగా ఐదు వికెట్లు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl