ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న మ్యాక్స్ వెల్ పేరు వింటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు పుడుతూ  ఉంటుంది  ఎందుకంటే అతను బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం అలాంటిది   అయితే మ్యాక్స్ వెల్ క్రీజులో కుదురుకున్నాడు అంటే ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలడు అనే విషయాన్ని గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో అందరికీ చూపించాడు. ఒకవైపు కాలు గాయం వేధిస్తున్నప్పటికీ.. కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతను వీరోచితంగా పోరాడి.. డబుల్ సెంచరీ చేసిన తీరు ఇక క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఫిదా చేసేసింది.



 ఏదైనా చిన్న గాయం అయితేనే ఆటగాళ్లు మైదానం వీడి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది మ్యాక్స్ వెల్ తొడ కండరాలు పట్టేస్తూ తీవ్రమైన నొప్పి వేధిస్తున్న.. నడవలేని పరిస్థితిలో ఉన్న క్రీజులో నిలబడి సిక్సర్లు ఫోర్ లతో  చెలరేగిపోయారు. ఏకంగా పూనకం వచ్చినట్లుగా ఊగి పోయి డబుల్ సెంచరీ చేశాడు.  ఆ ఇన్నింగ్స్ ని ఎప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాంటి మ్యాక్స్ వెల్ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రం చెత్త ప్రదర్శనలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తాడు అనుకుంటే.. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు.


 ఇటీవల వాంకడే వేదికగా ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కూడా ఆర్సిబి ప్లేయర్లు మరోసారి విఫలమయ్యారు. గత మ్యాచ్లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఈసారి తక్కువ పరుగులకే వికెట్ కోల్పోగా.. మ్యాక్స్ వెల్ మరోసారి డక్ అవుట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన మ్యాక్సీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే మాక్స్వెల్ ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్ ఏకంగా 17 సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా.. దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన నిలిచాడు మ్యాడ్ మాక్సి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl