సాధారణంగా మనందరికీ తెలిసిన  సెలబ్రిటీలను చూస్తూ ఉంటే సామాన్య మనుషుల్లాగా ఆయా సెలబ్రిటీలకు వీక్నెస్ లు అనేవి ఉండవు అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు.  కానీ  సెలబ్రిటీలు కూడా అందరిలాంటి మనుషులే.  సామాన్యులకు ఉన్నట్లుగానే వారికి కూడా ఎన్నో వీక్నెస్ లు ఉంటాయి. కానీ వారి వీక్నెస్ లను బయటకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి విషయాలు తెలిస్తే ప్రతిసారి కూడా వారి వీక్నెస్ లనే ఫోకస్ చేసి చూస్తూ ఉంటారు అభిమానులు, ప్రేక్షకులు.


 అందుకే ఇలాంటి వీక్నెస్ లకు సంబంధించిన సీక్రెట్ లను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటికి చెప్పడానికి అభిమానులతో పంచుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు టీమిండియా స్టార్ ప్రేయర్ విరాట్ కోహ్లీ సైతం ఇటీవల తనకు ఉన్న ఒక వీక్నెస్ గురించి బయట పెట్టాడు. సాధారణంగా కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బ్యాట్ పట్టుకొని బరులోకి దిగాడు అంటే చాలు పరుగుల ప్రవాహం కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే కోహ్లీని చూస్తే ప్రత్యర్థి ఆటగాళ్లు అందరూ కూడా తెగ భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే కోహ్లీని మైదానంలో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అతనికి ఏ వీక్నెస్ ఉండదేమోఅని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయంలో మాత్రం తెగ భయపడిపోతాడట కోహ్లీ. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్లైట్ ఒడిదుడుకులకు లోనైతే కోహ్లీ ఎంతగానో భయపడిపోతాడట. ఆ సమయంలో ఏకంగా పిరికి వాడిలాగా ప్రవర్తిస్తానని.. ఏదైనా సమస్య వస్తే ఇక సీట్లను గట్టిగా పట్టుకునే వారిలో తానే మొదటి వ్యక్తిని అంటూ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలా జరిగినప్పుడల్లా ఇక తన పని అయిపోయింది అని భావన కలుగుతుంది అంటూ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: