ఇండియన్ క్రికెట్ లో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నాడు దినేష్ కార్తీక్. ఎందుకంటే ఎంతో టాలెంట్  ఉన్నప్పటికీ అతనికి టీం ఇండియాలో దక్కిన అవకాశాలు మాత్రం అడపాదప మాత్రమే. ఇక మిడిల్ ఆర్డర్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఇక కీపింగ్ లో కూడా ఎంతో గొప్ప నైపుణ్యం ఉన్నప్పటికీ అప్పటికే ధోని జట్టులో ఉన్న కారణంగా దినేష్ కార్తీక్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. దీంతో ఎప్పుడో ఒకసారి తప్ప పెద్దగా టీమిండియాలో అవకాశాలు మాత్రం రాలేదు.


 అయితే ఇక దినేష్ కార్తీక్ కెరియర్ ముగిసిపోయింది. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనుకుంటున్న సమయంలో అతను మాత్రం భారత జట్టులోకి వచ్చేందుకు.. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. గతంలో ఐపీఎల్లో అద్భుతమైన ఆట తీరును కనబరిచి టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు దినేష్ కార్తీక్. ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ కి ముందు కూడా బ్యాటింగ్ లో ఇలాంటి విధ్వంసమే  సృష్టిస్తున్నాడు. ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ కు ప్రేక్షకులు అందరిని కూడా ఫిదా చేసేసింది..


 ముఖ్యంగా ఆకాష్ మద్వాల్  వేసిన 16 ఓవర్ లో ఒకే తరహా ఇనోవిటీవ్ షాట్స్ తో నాలుగు బౌండరీలు బాదాడు దినేష్ కార్తీక్. ఒకవైపు నిప్పులు చెరుగుతున్న బుమ్రా బౌలింగ్లో సైతం  అదరగొట్టాడు. 19 ఓవర్లో రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి దూకుడు మీద ఉన్న బుమ్రాకు ఇక ఆఖరి బంతిని సిక్సర్ గా మలీచి షాక్ ఇచ్చాడు దినేష్ కార్తీక్. అటు వెంటనే కార్తీక్ దగ్గరికి వచ్చిన రోహిత్ శర్మ డీకే ని మెచ్చుకుంటూ ఆట పట్టించాడు. రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అవడంతో వైరల్ గా మారిపోయాయి.



 శభాష్ రా కార్తీక్.  ప్రపంచకప్ ఆడేందుకే ఇలా చెలరేగుతున్నావు కదా అంటూ రోహిత్ శర్మ టీజ్ చేయడంతో ఇక ఇద్దరు కూడా నవ్వుకున్నారు. కాగా t20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ కూడా పోటీ పడుతున్నాడు. ఇప్పుడు అతను మిడిల్ ఆర్డర్లో విధ్వంసకరమైన  బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తే ఇక మరోసారి సెలెక్టర్లు అతన్ని టి20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అపారమైన అనుభవం ఇక మంచి ఫామ్ అతనికి కలిసి వచ్చే అంశాలు అని చెప్పాలి.  ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండడంతో ఐపీఎల్లో దినేష్ కార్తీక్ ఆటను దగ్గర నుంచి చూస్తున్న రోహిత్ ఇక అతన్ని టీం లోకి తీసుకోవాలని సెలెక్టర్లకు సూచన చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: