2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందు నుంచి అటు రోహిత్ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా  మారింది. ఇక రోహిత్ కు సంబంధించి రోజు ఏదో ఒక వార్త తెరమీదకి వస్తూనే ఉంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఐదు సార్లు టైటిల్ అందించిన సారథిగా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలు నుంచి తప్పించింది. హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ నిర్ణయంపై అందరూ షాక్ అయ్యారు. ఇక రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని అస్సలు జీర్ణించుకోలేక.. ఇక ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేశారు. ఇక ఇప్పటికీ ఇదే విషయంపై కొత్త కెప్టెన్ హార్దిక్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.


 ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ ముంబై నుంచి బయటికి వస్తాడని వార్తలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే  అతన్ని దక్కించుకునేందుకు మిగతా ఫ్రాంచైజీలు  వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను  మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన ఆటగాళ్లని వేలంలోకి వదిలేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ ను మార్చి.. 8 మందిని తీసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు  ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ ను కోరుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అటు కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ రోహిత్ శర్మను తమ టీం నుంచి వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.


 రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల తమ బ్రాండ్ వేల్యూకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన ఆ జట్టు యాజమాన్యం.. ఇక రోహిత్ శర్మ జట్టును వదిలి మరో టీం లోకి వెళ్లకుండా ఉండేలా బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో కారులో ప్రయాణించినట్లు సమాచారం.  అవసరమైతే ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలను తిరిగి మళ్లీ రోహిత్ కి కట్టబెట్టేందుకు కూడా జట్టు యాజమాన్యం  సిద్ధంగా ఉందట. 2024 ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ లోని ఈ నిర్ణయం తీసుకోవచ్చని వాదన కూడా వినిపిస్తుంది. అదే సమయంలో రోహిత్ ఇక ముంబైని వీడకుండా ఉండేందుకు ఆ జట్టు యాజమాన్యం భారీ ఆఫర్ కూడా ఇచ్చిందట. ఏకంగా తమ వ్యాపారాల లో భారీ విలువైన షేర్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: