ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది. అద్భుతమైన ఆట తీరుతో వరుసగా విజయాలు సాధిస్తుంది. ఈ క్రమం లోనే ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం లో కొనసాగుతూ ఉంది. ఇక ఈసారి రాజస్థాన్ రాయల్స్ దూకుడు చూస్తూ ఉంటే.. తప్పకుండా రెండో సారి టైటిల్ విజేతగా నిలిచేలాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సాంసంగ్  ఒకవైపు కెప్టెన్గా జట్టును సమర్ధవంతం గా ముందుకు నడిపించడమే కాదు.. ఇంకోవైపు వ్యక్తిగత ప్రదర్శన విషయం లో కూడా అదరగొట్టేస్తూ ఉన్నాడు.


 అయితే ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇటీవల అనూహ్యమైన షాక్ తగిలింది. ఏకంగా ఆ జట్టు స్టార్ స్పిన్ బౌలర్ ఆడం జంపా నేను ఐపీఎల్ ఆడలేను బాబోయ్ అంటూ ఇక తప్పుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ సీజర్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నానని.. నిర్విరామంగా క్రికెట్ ఆడలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.


 అయితే గత ఏడాది కాలం నుంచి నిరంతరాయంగా క్రికెట్ ఆడుతూనే వస్తున్నాను అంటూ జంపా గుర్తు చేసుకున్నాడు. శరీరం పూర్తిగా అలిసిపోయింది అని.. విశ్రాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పైగా చాలా కాలంగా భారత్ లోనే ఉంటున్నాను అంటూ చెప్పాడు. ఈ ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నదం కావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కంటే వరల్డ్ కప్ ముఖ్యమని.. అందులో ఆడటానికి కొంతసమయం విశ్రాంతి అవసరమని అనుకుంటున్నాను అంటూ ఆడం జంప వివరించాడు. అయితే ఆడమ్ జంపా ఇలా ఐపీఎల్ ఆడలేను అంటూ ఇక సీజన్ నుంచి తప్పుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl