ఐ పీ ఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2024 లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కి ముందు లక్నో జట్టు కి పెద్ద షాక్ తగిలింది. లక్నో జట్టులో ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న స్పీడ్ బౌలర్ మయాంక్ యాదవ్ ఈ రోజు మ్యాచ్ కి దూరం కానున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... ఈ నెల 7 వ తేదీన గుజరాత్ తో లక్నో మ్యాచ్ ఆడిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మ్యాచ్ నడుస్తున్న సమయంలో తుంటి గాయంతో మయాంక్ అర్ధాంతరంగా మైదానాన్ని వీడి బయటకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఈయన గాయం తగ్గి నెక్స్ట్ మ్యాచ్ కి ఆడతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఈయన తదుపరి మ్యాచ్ కి కూడా దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి కూడా ఈయనకు 7 వ తేదీన మ్యాచ్ మధ్యలో అయిన గాయం మానలేదు అని ... ఆ నొప్పి తగ్గడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది అని ... మరికొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఈయన మ్యాచ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం అద్భుతమైన బౌలింగ్ తో లక్నో జట్టుకు కీలక ఆటగాడిగా మారిన మాయాంక్ ఈ రోజు మ్యాచ్ లో లేకపోవడం ఈ జట్టుకు కాస్త మైనస్ అనే చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ లక్నో జట్టు 19 వ తేదీన చెన్నై తో మ్యాచ్ ఆడనుంది. అప్పటి వరకైనా ఈ ఆటగాడు పూర్తిగా కోలుకొని మ్యాచ్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని ఈ జట్టు మేనేజ్మెంట్ మరియు ఈ టీం అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. మరి నెక్స్ట్ మ్యాచ్ వరకు ఈ పేసర్ కోలుకొని తదుపరి మ్యాచ్ ఆడతాడో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: