ఇండియన్ క్రికెట్ టీం లో అత్యంత క్రేజ్ కలిగిన ఆటగాళ్లు అయినటువంటి విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఎంత మంచి స్నేహితులో మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ గ్రౌండ్ లోకి వచ్చారు అంటే ఎంతో స్పోర్టివ్ గా ఉంటారు. ఇది ఇలా ఉంటే వీరు (ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విరు వేరు వేరు జట్లకు ఆడుతున్నా కానీ ఎంతో సరదాగా మెలుగుతూ ఉంటారు. 

విరాట్ కోహ్లీ (ఐ పీ ఎల్) లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతూ ఉండగా ... రోహిత్ శర్మ ...  ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. నిన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేస్తూ రోహిత్ ఒక వైపు చూస్తూ ఉండగా ... వెనుక వైపు నుండి కోహ్లీ వచ్చి తనను తాకి వెళతాడు. 

దానితో వెంటనే రోహిత్ ఏమయిందా అని వెనక్కు తిరిగి చూస్తాడు. దానితో కోహ్లీ నేనే అని చెప్పగా రోహిత్ శర్మ ఓకే అంటూ చూపిస్తాడు. ఇక ఈ వీడియో ఫన్నీగా ఉండడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే నిన్న జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కేవలం  15.3 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి బెంగళూరు పై అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిన్నటి విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో కాస్త మెరుగు పడగా ... బెంగళూరు మరింత దిగజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: