ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో అత్యంత పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ టీం ప్రతిసారి లాగానే ఈ సారి కూడా మంచి అంచనాల నడుమ సీసన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఒకటి , రెండు మ్యాచ్ లలో పర్వాలేదు అనే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జట్టు ఇప్పుడు మాత్రం మరి దిగజారిపోయిన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అసంతృప్తికి గురి చేస్తుంది.

ఈ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లను ఆడింది. అందులో కేవలం ఒకే దాంట్లో గెలిచి ఐదింటిలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో కింది నుండి 2 వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ టీం ప్లే ఆప్స్ కి వెళ్ళాలి అంటే ఏడు మ్యాచ్ లను గెలవాల్సి ఉంది. ఈ జట్టు ఆడవలసిన మ్యాచులు 8 ఉన్నాయి. దానితో ఇప్పటి నుండి అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిస్తే తప్ప ఆర్సిబి ప్లే ఆప్స్ కి వెళ్లలేదు.

ఇకపోతే ఈ జట్టు ఇంత పేలవమైన ప్రదర్శనను కనపరచడానికి ప్రధాన కారణం ఈ జట్టు బౌలర్లే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే ... ఇప్పటి వరకు ఆర్సిబి ఆడిన మ్యాచ్ లలో బ్యాటింగ్ విభాగంలో ఈ టీం మంచి పర్ఫామెన్స్ ను కనబరిస్తుంది. దాదాపుగా ప్రతి మ్యాచ్ లోనూ 200 పరుగులకు దగ్గరగా స్కోర్ చేస్తుంది.

అలా బారి టార్గెట్ ను ఆపోజిట్ టీం కు ఇచ్చినప్పటికీ ఈ జట్టు బౌలర్లు మాత్రం దాదాపు పది , అంతకు మించిన ఎకానమీతో పరుగులు ఇస్తున్నారు. నిన్న బెంగుళూరు , ముంబై తో తలపడింది. ఇందులో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేయగా ఆ తర్వాత ముంబై కేవలం 15.3 ఓవర్లలోనే 199 పరుగులు చేసి ఈ జట్టుపై విజయం సాధించింది. ఇలా ఈ బట్టు వరస ఓటములకి కారణం ఈ జట్టు బౌలింగ్ ప్రదర్శనే అని కొందరు అభిప్రాయపడుున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb