టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే కేవలం భారత క్రికెట్లో మాత్రమే గుర్తింపును సంపాదించుకోవడం కాదు తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఏకంగా తమ సొంత దేశ క్రికెటర్లను అభిమానించడం మానేసి ఇండియా క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. తన ఆట తీరుతో మాత్రమే కాదు తన యాటిట్యూడ్ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే రికార్డుల విషయంలో కూడా నేటితరం స్టార్ క్రికెటర్లు ఎవరు కూడా అటు విరాట్ కోహ్లీకి సాటిరారు అనడంలో సందేహం లేదు. ఇక రికార్డుల విషయంలో సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం విషయంలో కూడా కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా విరాట్ కోహ్లీ ఇప్పుడు వరకు ఎన్నో రికార్డులు సృష్టించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. రోహిత్ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడి గెలిచిన మ్యాచ్లలో 3882 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ప్లేయర్ ఐపీఎల్లో ఆర్సిబి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు గెలిచిన మ్యాచ్లలో 3876 పరుగులు చేశాడు. అయితే ఈ లిస్టులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. గెలిచిన మ్యాచ్లలో అతను 3945 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: