టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా భారత కెప్టెన్గా ఉన్న సమయంలో ధోని ఇక ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా కూడా ప్రస్తానాన్ని కొనసాగించాడు. అంతేకాదు ఇక టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనికే దక్కింది.


 అయితే కేవలం భారత జట్టు కెప్టెన్ గా మాత్రమే కాదు.. అటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కూడా అంతే సక్సెస్ అయ్యాడు ధోని.. తన కెప్టెన్సీలో ఏకంగా సీఎస్కే టీంకి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించి ఆ జట్టును ఛాంపియన్ టీం గా నిలపడంలో సక్సెస్ అయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోని అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై తరపున ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే గత సీజన్ వరకు చెన్నై కెప్టెన్ గా కొనసాగిన ధోని ఈ సీజన్లో మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.


 దీంతో ఇక చివరి ఐపిఎల్ సీజన్లో ధోని ఆడే ఒక్క మూమెంట్ మిస్ అవ్వకూడదని అభిమానులు అనుకుంటున్నారు. ఇక సీఎస్కే ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా ఇక స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీతో నిండిపోతుంది. ధోని స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఏకంగా చెవులు పగిలిపోయేలా ధోని నినాదాలు స్టేడియంలో వినిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోని బ్యాటింగ్ చూసేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు అయినా సిద్ధంగా ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక అభిమాని చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏకంగా ఒక అభిమాని 64000 పెట్టి బ్లాక్లో టికెట్టు కొనుగోలు చేసి చెన్నై, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్ చూశాడట. కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులు కూడా ఇలా ధోని చూసేందుకు ఖర్చు పెట్టాడట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: