టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్గా  కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియాలోనే కాదు  ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అది తక్కువ సమయంలోనే తాను ఇక వరల్డ్ క్రికెట్ ని ఏలబోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు విరాట్ కోహ్లీ.


 ఇక ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టి తనకు తిరుగులేదు అని చూపించాడు. ఒకరకంగా విరాట్ కోహ్లీ మహా మహా బౌలర్లకు సైతం సింహ స్వప్నంలా కొనసాగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.  కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు అతనికి బౌలింగ్ చేయడానికి స్టార్ బౌలర్లు  సైతం భయపడేవారు. ఎందుకంటే ఇక అతను కొట్టే కొట్టుడుకు ఎక్కడ తమ ఖాతాలో చెత్త రికార్డులు వచ్చి చేరిపోతాయో అని. ఇలా ఇప్పటివరకు మహా మహాబౌలర్లను సైతం తన బ్యాటింగ్ విధ్వంసంతో భయపెట్టిన విరాట్ కోహ్లీని.. ఒక బౌలర్ మాత్రం భయపెట్టాడట. ఆ బౌలర్ దెబ్బకి ఏకంగా కోహ్లీ చూపు కూడా మసకబారిందట.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా తో 2014లో జరిగిన టెస్టు సిరీస్ లో జాన్సన్ బౌలింగ్ సవాల్ గా తీసుకొని ఆడినట్లు కోహ్లీ తెలిపాడు. తొలి మ్యాచ్ లో జాన్సన్ వేసిన బంతి నా తలకు తగిలింది. దీంతో ఎడమ కంటి చూపు కాస్త మందగించడం ప్రారంభమైంది. దీంతో లంచ్ సమయంలో పోరాడాలా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలా అని ఆలోచించాను. అయితే జాన్సన్ కు దీటుగా సమాధానం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. చివరికి అతని బౌలింగ్ ను ఎదుర్కొన్నాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా ఈ టెస్ట్ సిరీస్ లో కోహ్లీ నాలుగు శతకాలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: