గత ఐపిఎల్ సీజన్ వరకు గుజరాత్ కెప్టెన్గా కొనసాగిన హార్దిక్ పాండ్యా ఇక ఇప్పుడూ తన ఓల్డ్ టీం తరఫున ఆడుతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే పాత జట్టు తరఫున ఆడటమే కాదు ఏకంగా కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. దీంతో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే బరిలోకి దిగుతుంది. కానీ ఎందుకో అంచనాలను మాత్రం అందుకోలేక పోతుంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ నుంచి కూడా వరుస పరాజయాలతో సతమతమవుతుంది.


 అయితే ఇక ఇప్పుడు వరుసగా రెండు విజయాలు సాధించడంతో ముంబై ఇండియన్స్ టీం మళ్లీ పుంజుకున్నట్లుగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇలా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై మాత్రం తీవ్రస్థాయిలో అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా బ్యాట్స్మెన్ గా పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా బౌలింగ్ జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఒకటి రెండు ఓవర్లు మాత్రమే వేసి ఊరుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.


  ఇదే విషయం గురించి మాజీ ఆటగాడు సైమన్ డౌల్ స్పందిస్తూ అనుమానం వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడేమో అంటూ అనుమానపడ్డాడు. గాయపడిన విషయాన్ని పాండ్యా అంగీకరించడం లేదని.. సైమన్ డౌల్ ఆరోపించాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తొలి రెండు మ్యాచ్లలో తొలి ఓవర్లలోనే బౌలింగ్ చేయడానికి వచ్చిన హార్థిక్ పాండ్యా.. ఇక తర్వాత జరిగిన మ్యాచ్లలో మాత్రం కేవలం ఒక్కటే ఒక ఓవర్ వేసి సరిపెట్టుకున్నాడు. కచ్చితంగా అతనికి ఏదో జరిగిందని.. కానీ ఆ విషయాన్ని బయటకు రానివ్వడం లేదని.. అందుకే అతను పూర్తిస్థాయిలో బౌలింగ్ వేయడం లేదు అంటూ సైమన్ డౌల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: